Sri suktha Rahasyardha pradeepika
Chapters
ఈ కృతి శ్రీమాతృ సమర్పితము అమవస చూపునన్, జలనమందని పున్నమ చూపునందుఁ బా డ్యమి కనుబాటునందు, నిపుడప్పుడు నాకయె పిల్చినంత, ని స్సమసుమమందహాస వికసన్ముఖసోమునిఁ జూపి, మేల్ రువా ణమె తనువూని, లోఁబొడిచి నాస్థితినే మఱపించి, దివ్యశ ర్మము దొరలించి, కర్ణవివరమ్ములలో నమృతమ్ము నించి, చే యు మనవు లాలకించు కరుణోదధి, మాత్రిపురాంబ శ్రీపదా ర్హమఱొకరేరు దీనిఁగొన నర్హలు? తానయి పల్కె స్వీయసూ క్తముల రహస్యభావములు; కట్టడ చేసెను నన్ను వ్రాత, కా యమకె యొసంగువాఁడను సుమాంజలితో; జగదంబ! వెట్టి శే షము గటదేని సిద్ధుఁడను; చాలును, నాయన! యర్వదేడు నేం డ్లు మనితి నాసపర్యలను లోపము చేయక; రమ్ము, విశ్రమిం పు మిఁక మదంకమందనుచు బుజ్జగమాడిన మేలె; కొండ యం తమిగిలి యున్నదన్నఁదనుదార్ఢ్య మొసంగు; మదేదొ తర్పు; మ శ్రమమునఁ జేరఁదీసి పరశాంతి యొసంగుము; మళ్ళి తల్లిస్త న్యమునకు దేవులాడఁగలనా? భవరోగనిహంత్రి! నీ పదా బ్జమధు మహౌషధంబు గుణపాఠమదే కదెయండు వేడుచున్ || - శ్రీ శ్రియానందనాథుఁడు -*- ఓం హ్రీం శ్రీమాత్రే నమః ఈం బీజవాచ్యాం శ్రీదేవీం మహాత్రిపురసుందరీం, ''రహోయాగక్రమారాధ్యాం రహోయజ్ఞనివాసినీం'' సమప్రదానాం శ##ర్వేణ సమోతాం సమయార్చితాం, వందారుజనమందారం నందే వాగర్థదాయినీం || శ్రీ విద్యానందనాథాయ గురవే శిష్టశీలినె, మునయే గుణరత్నానాం ఖనయే ధర్మశాలినే || అంతేవాసిగుహావ్యాప్త తమోనుద్ధేమమాలినే, నమస్కరోమి శ్రీసూక్త రహస్యార్థప్రకాశ##నే || కృతితాం సమపేక్ష్యాహం సత్యనారాయణాభిధః, శ్రీ శ్రియానందనాథాఖ్యో దీక్షయేశ్వరవంశజః || శ్రద్ధాళుపాఠకులకు నివేదనము శ్రీ కాముఁడైన సాధకుఁడు శ్రీదేవీస్వరూపవర్ణనమును శ్రీదేవ్యుపాసనమార్గములును, విదులును, దజ్జన్యఫలములును, శ్రీదేవీపారమ్యమును, జక్కఁగా సంక్షేపముగా నిముడ్పఁబడిన మంత్రములుగల శ్రీసూక్తమనెడి పదునేను ఋక్కుల గ్రంథమును బఠించుచున్నాఁడు. ఈ మంత్రములు ఋగ్వేదోద్ధృతము లని ప్రసిద్ధిగదా? మంత్రార్థమననము లేని ప్రయత్నము ఫలదము కాదని తంత్రాగమములందు నిందింపబడినది. అర్థమనన మనఁగానే యందలి భగవత్కల్యాణ గుణబోధముతో భగవదనుగ్రహ లాభోపాయములును బోధపడును గావుననే ''మననాత్ త్రాయత ఇతి మంత్రః'' అని నిర్వచించిరి. అర్థమననమువలన సాధకుని రక్షించునది యనుట. తెలిసిన యా యుపాయముల నాచరణమునఁ బెట్టినపుడు గాని ఫలము లేదని సద్గురువుల నాశ్రయింపఁజూచును. సద్గురులాభ##మే గలిగెనా, ధన్యుఁడే యగునని, జగదనుగ్రహబుద్ధితోనే ''అర్థమెఱుంగని మంత్ర మును జపించుట - గాడిద గందపుఁగట్టెల మోచినటులే'' యనియు ''అగ్నిలేని బూడిదయం దాజ్యహోమ'' మనియు, భాసురానందాదు లెందఱో నిందించిరే కాని, తమ గొప్ప మొప్పునొందనుం గాదు. ఒరులను జిన్నబుచ్చుటకునుం గాదు. ఏదేనొక లౌకిక విద్యను గొననెంచినను దానికిఁ జెందిన పారిభాషికముల యర్థబోధము సమగ్రముగా నున్నపుడే కాని యావిద్య యందలి రహస్యము లందవు; అట్టి విద్యార్థి రాణింపఁడు. దాని నుఫలము నందను లేఁడు. అట్టిచో బ్రహ్మవిద్యా విషయకమై భగవదనుగ్రహము సంపాదించు సూచనములు గల మంత్రరూపములైన మాటల ప్రకట గుప్తార్థములను సమగ్రముగా నెఱింగి, వాని నాచరణమందుఁ బెట్టినపుడే సాధకుఁడైన జీవుఁడు పూర్ణ కాముఁడు కాఁగలఁడు. అట్టి యుపాయము లన్నియు శ్రుతిసమ్మతములు. విద్యార్థియైన సాధకుఁడు శ్రుతిపారగుఁడై, యీ శ్రుతులనుండి ప్రధాన భూతములైన వాని నుద్ధరించుకొని ధన్యుఁడగుటకు, ఎంతయో కాలము నెంతయో శ్రమమును గావలయును. అట్టి గొడవను బడకుండ విద్యార్థిసాధకులను సులభముగా నుత్తీర్ణులను జేయుటకయి, నిర్మలానుగ్రహ బుద్ధితో నేర్చి కూర్చి సుఖాను సరణీయములయిన యుపాయములను మనకు విడిచి పోయిన మహర్షులు త్రికాలవంద్యులు. అట్టి వానిలోఁ బ్రథమగణ్యమును సార్థకమును నైనది శ్రీ గాయత్రీ మహామంత్రము. దాని యుపాస్తివిధిని గురువులు ''ఓం భూః'' అని యూరక ముక్కుపట్టించుట కాక, చిననాఁటి నుండియుఁ బ్రాణాయామమును బోధించి, యించుకంత షట్చక్రవివేకమును గలిగించి, యథాధికారముగా మంత్రార్థ బోధమును జేసి, మంత్రబీజములను జక్రములందు న్యసించు కొనుటను, దాని ప్రయోజనమును దెలిపి బ్రహ్మచారులను సఫలమైన సార్థకమై యుపనయనకర్మము గల వారలనుగాఁ జేసినపైని వారే తమంతటఁ గ్రమముగా భగవత్పదార్ధమును గూర్చిన శ్రుత్యుక్తవిశేషములను గ్రహించుకొని బ్రహ్మవిద్య యందు త్తీర్ణులై, మానుషజన్మగ్రహణఫలము నొందఁగలరు. తరువాత నాతఁడు విద్వాంసుఁడై యొప్పినను, భగవన్మహిమమును ఆత్మపరమాత్ముల సంబంధమును విస్మృతములు కానట్లును, భుక్తిముక్తి ప్రదమగు భగవదుపాసనము నిత్యాచరణ మందుండునట్లును, దోడ్పడు దారులేవియని, తమ కాలమును బుద్ధిశక్తిని దారవోసి, కొన్ని వేదసూక్తముల నుద్ధరించి మన కెన్నియో యవ్యాజానుగ్రహముతో నిచ్చిరి. ఇవి : శ్రీసూక్త, పురుషసూక్త, భూసూక్త, నారాయణసూక్త, దుర్గాసూక్త, దేవీసూక్త, రాత్రిసూక్త, రుద్రసూక్త ముఖము లెన్నియో, సాధకుల యభిలాష రుచులను బట్టి యుపయోగించుకొనుటకుఁ గలవు. అయిన నందు ముఖ్యాతి ముఖ్యములు శ్రీసూక్త పురుససూక్తములు. శ్రీమత్పరబ్రహ్మపదార్థముయొక్క సగుణ నిర్గుణ వర్ణనములు నుపాసా విదులు గలిగి బ్రహ్మవిద్యార్థులగు వైదికుల నిత్యపారాయణమందు బహుళముగా నున్నవివియే. అందు మొదటిది ''శ్రీగురుః సర్వాకారణభూతా శక్తిః'' అను శ్రుతిని బట్టి, సర్వకారణభూతయై శ్రీశబ్దవాచ్య యగు తద్బ్రహ్మశక్తిని గూర్చి పలుకునది శ్రీసూక్తము. రెండవది పురుషుఁడని శ్రుతివ్యవహారము గల బ్రహ్మ మును గూర్చి పలుకునదె పురుషసూక్తము. శక్తి శక్తి మంతుల కభేదమగుటచే రెండు సూక్తము లందునుం డల వర్ణనము నుపాసనవిధమును నొక్క వస్తువును గూర్చియే యని సమ్మతింపక తప్పదు. ఒక దానఁ బురుష భావముతో ననఁగాఁ బితృబుద్ధితో వర్ణింపఁబడిన బ్రహ్మ వస్తువే, తచ్ఛక్తియై మాతృబుద్ధితో రెండవదాన వర్ణింపఁబడినది. మాతృబుద్ధితో నుపాసింపఁబడు బ్రహ్మధర్మమైన యా విమర్శశక్తియే, కార్యభేదమును బట్టియు, నుపాసకోపయోగమును బట్టియు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహా త్రిపురసుందరి, దుర్గ, చండి మున్నగు ననేక నామములతో నారాధింపఁబడి తన విశిష్టమహిమముచే భక్తులను దనుపుచున్నది. ఇపుడు మహాలక్ష్మియను బ్రహ్మశక్తి విషయమే నా లేఖిని కెక్కి యీ చిన్ని గ్రంథముగా మీ పవిత్రహస్తముల నలంకరించుచున్నది. అదె శ్రీ సూక్త రహస్యార్థము, ప్రకటార్థపూర్వము. సు+ఉక్తము=చక్కఁగా (స్వానుభవమున నిస్సంశయముగా)ఁ జెప్పఁబడినది. సూ+ఉక్తము=తల్లిని గూర్చి చెప్పబడినది. సు+ఊ+ఉక్తము=చక్కఁగా మహా విద్యేశ్వరిని గూర్చి చెప్పఁబడినది. ''మహావిద్వేశ్వరీ శాంతి ర్భూరూ ర్వాణీ మహేశ్వరః'' మంత్రాభిధానము. శ్రీ+సూ+ఉక్తము = లక్ష్మియనెడి తల్లినిగూర్చి చెప్పఁబడినది. శ్రీ+సు+ఉక్తము = (శవర్ణము ఆనందవాచి, రేఫము తేజోవాచి, ఈ లక్ష్మివాచి) జ్ఞానానందస్వరూపిణియైన లక్ష్మిని గూర్చి నిస్పంశయముగాఁ జెప్పఁబడినది. ఈ తల్లి యనఁగా బ్రహ్మశక్తి.సృష్టి స్థితి సంహారరూపగా వెలయునదే. కేశ విష్ణు స్వరూపాఢ్యాం = క+ఈశ+విష్ణు+స్వరూపాఢ్యాం = బ్రహ్మ, రుద్ర, విష్ణుల రూపము లతో నొప్పునది. అనగా, తన గుణములే యైన సత్త్వ రజస్తమస్సులే యూఁతగా సృష్టి స్థితి సంహారశక్తులు గల త్రిమూర్తుల రూపములామెవే. అయినను నిపుడు నా చేపట్టిసదియు, మీరు చదువఁబోవునదియు శ్రీశబ్దవాచ్యయై స్థితిరూపబాహ్య జీవి కాలంబయై లక్ష్మి యనఁబడుచు ధన ధాన్య గృహారామ పశు పుత్ర కళత్రాది సంపద్దాత్రి యైనదేకాదు. మాతృభావముతో లోను పాసింపఁబడి భుక్తిముక్తుల రెంటిని బ్రసాదించు జ్ఞానానందస్వరూప బ్రహ్మశక్తియే యనఁదగును. 'శ్రీ' శబ్దమునకు బ్రహ్మమనియే యర్థము. శ్రీవిద్య యనబ్రహ్మవిద్య. ''వదంతి శం సుఖం శ్రేయః'' ''ప్రకాశో దర్శనో దీపో రేఫో కృష్ణః పరం బలీ'' ''ఈ త్రిమూర్తిర్మహామాయా లక్ష్మీరీకార ఉచ్యతే'' అని మాతృకాభిధానము గాన, (సుఖమనఁగా నానందము, ప్రకాశమనఁగా జ్ఞానము) జ్ఞానానంద స్వరూపిణి యయి, త్రిమూర్తి మూర్తియైన యిమ్మహా మాయయే లక్ష్మీశబ్దవాచ్య బ్రహ్మశక్తి. బ్రహ్మవస్తువు ''న స్త్రీ న చ పుమాన్'' అను శ్రుతివలన, స్త్రీ కాదు, పురుషుఁడు కాదు, గాన నేరూపముననేని భావించి భజింప వచ్చును. శక్తి శక్తి మంతులకభేదము శ్రుతి ప్రతిపాదితము గానఁదండ్రిగా భావింపఁబడిన బ్రహ్మవిషయమే తల్లిగా భావింపఁబడిన బ్రహ్మము విషయమగుటనే శ్రీచక్రమునకుఁ బరబ్రహ్మ చక్ర మనియు శ్రుతివ్యవహారము. ఇపుడు శ్రీసూక్తమనగా, శ్రీశబ్దవాచ్యయై, సకలమును బ్రసవించి పెంచు తల్లిగా నెన్నఁబడిన బ్రహ్మశక్తిని గూర్చి నిస్సంశయముగాఁ జెప్పఁబడిన మాట యని తేలినది. బ్రహ్మమును మాతృరూపమున భజించు విశేషమేమందురా? స్వభావమునఁ దల్లికిఁ దన ప్రజలయందుఁ బ్రేమ మెండనుట యెల్ల రెఱింగినదే. ఉపనయనకాలమునఁ దైవర్ణికులకుఁ జేయఁబడు బ్రహ్మోపదేశమును గమనింపుఁడు. ''ఓమిత్యేకాక్షరం బ్రహ్మ'' యని యారంభించి యుపాసనవేళ ధ్యానమునకైన రూపకల్పనమున స్త్రీరూపమునే కల్పించి ''వేదమాతా తు గాయత్రీ'' యని తల్లిగానే యారాధింపు మనిరి. ఆ బ్రహ్మోపదేశము కాఁగానే వటుఁడు ముందుగాఁ దల్లికే మ్రొక్కవలయును. శీక్షావల్లియు ''మాతృదేవో భవ, పితృ దేవో భవ'' యనుచు ముందుగా మాతృపూజనే శిక్షించినది. ఇన్నేల, తానై యేరికిని మ్రొక్కరాని సన్న్యాసియుఁ దల్లికి మ్రొక్కక తప్పదు. భారతమున యక్షప్రశ్నములందు ''మాతా పృథివ్యా అపి మహీయసీ'' యని నాఁడు. మఱి చూడుఁడు. ద్వంద్వ సమాస కల్పనమందును. ''దల్లి దండ్రులు, అత్తమామలు, రాధాకృష్ణులు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు'' మున్నగు వానిలో నేడఁజూచినను నగ్రస్థానము మాతృరూప శక్తిదే. కావున బ్రహ్మ మును మాతృరూపమున నుపాసించుటనే శీఘ్రఫలసిద్ధి యనిరి. ''అయ్యా! సూక్తములకుఁ బ్రకటార్థము రహస్యార్థము నని రెండుండునా? అటులుండి ప్రయోజనమేమి'' యని ప్రశ్నింతురో? వినుఁడు. ఉపాసన మూడు తెఱఁగులు. స్థూలసూక్ష్మపరోపాసనలు. రూపనామరహిత బ్రహ్మవస్తువు ననంతకళ్యాణ గుణము లందుఁగొన్ని మనకు నిత్యము దర్శనమాత్రన స్ఫురించు చుండునట్లు రూపకల్పనము చేసి యథాశక్త్యుపచారములతో సేవించుటయు, నీశ్వరుని సగుణమూర్తులై తద్విభూతితో సృష్టిలోఁగానవచ్చు సాలగ్రామతులస్యాదుల నుపచారములతోఁ గొల్చుటయు స్థూలోపాననము. ఇదే ప్రతీకోపాసనము. శ్రుతిగుప్త మంత్రములనో, యాగమోక్త మంత్రములనో జ్ఞానానుభవ సచ్చరిత్రలు గలిగి, ధనప్రతిష్ఠాశలు లేని సద్గురువుల వలన నుపదేశమొంది, భగవత్తత్వమును దెలుపు నామంత్రముల నర్థమననపూర్వకముగా జపించుచు, వరివస్యా (ఉపాసన) క్రమమున సేవించుట సూక్ష్మోపాసనము. ఈ రెండిటివలనఁ గలిగిన జ్ఞానమునే యనుభవమునకుం దెచ్చికొని జీవాత్మ పరమాత్మసంబంధము నెఱింగి యానంద స్వరూపుఁడై యండుటే పరోపాసనము. సూక్ష్మోపాసనమునం దాఱితేఱినపుడు స్థూలోపాసనము సడలిపోవును. పరోపాసనమే పట్టుపడినపుడు సూక్ష్మమును సడలిపోవును. అయిన నారెండును లోకానుగ్రహమునకై మానకుండుటే శ్రేయస్కరమని యాచార్యబోధము. బ్రహ్మ భూతులైన శ్రీశంకర భగవత్పాదులును బలుతావుల శ్రీచక్ర పీఠాదుల నిలుపుటకును జగద్గురు శ్రీరేణుకాచార్య దత్తమైన చంద్రశేఖరలింగమును నిత్యముం బూజించుచుండుటకును నిదియే హేతువు. మంత్రములు కొన్ని స్థూలోపాసనమును బోధించు నట్లుండి సూక్ష్మపరోపాసనార్థములను లో నిమిడ్చి కొని యుండును. అధికారి యన్నిఁటిని గొని తన వ్యవసాయమున కనురూపమైన ఫలము నొందుచుండును. అనధికారి, స్థూలో పాసనక్రమ మాత్రమునే గ్రహించి తదనురూపఫలమునే పొందు చుండును. ఇందేవిధమైన యుపాసనము చేసినను శాస్త్రోక్తమైన దాని ఫలమపుడే లభించినది కాదేమి యని విముఖుఁడు కారాదు. ''అధికారి యథాదేశే యథాకాలే యథామనుమ్! యాదృగ్విధానసంధానః ప్రజపేత్తాదృశం ఫలమ్ || కాలదేశక్రియారూపాద్యనురూపం లభేన్నరః | అత్యుత్కటేన పుణ్యన తస్మిన్నేవ హి జన్మని|| తత్ఫలం ప్రాఫ్నుయాత్సిద్ధో నాత్ర కార్యా విచారణా | పుణ్యస్యానుత్కటత్వే తు చిరాత్కించిత్ఫలం లభేత్ || ప్రతిబంధక బాహుల్యే ఫలం జన్మాంతరే లభేత్ | న దేవతోషణం వ్యర్థం భవిష్యతి కదాచన||'' ''అధికారియైనవాఁడు దేశకాల జపవిధుల ననుసరించి క్రమోపాసనము చేసినపుడు, తన వ్యవసాయమునకుఁ దగిన ఫలమును దప్పక పొందును. గత జన్మములం దుత్కటపుణ్య సంచయుఁడై యున్నచో నీ జన్మమందే యుపాసాఫలము నొందును. సందియము లేదు. పూర్వపుణ్యము వెలితియై యున్నపుడు కొంత కాలము పట్టును. పాపప్రతిబంధములే మిక్కుటముగా నున్నచో, ఫలావాప్తికై మఱికొన్ని జన్మములు కావలయును గాని, భగవంతుని సంతోష పెట్టు వ్యవసాయ మేనాఁడును వ్యర్థముకాదు'' మంత్ర రహస్యము. ఇఁకఁ, బురుషసూక్తమందలి బ్రహ్మోపాసనమునకంటె శ్రీసూక్తమునఁగల విశేష మేమనఁగా, అందులేని పరోపాస నానుభములు సాధక బోధమునకుఁగా గుప్తముగా స్తుతిప్రార్థన వేషముతో నిందుఁ దాండవించు చున్నవి. కనుకనే యవి తెలియఁగోరు నా విద్యార్థులకై నా యెఱింగినంతగాఁ జెప్పినదే, లిపిరూపము నొందించిన మఱరికైన నింత తోడ్పడదాయని యిటులు చేసితిని. ఉపాసన విషయమును దెలుపునదే యుపనిషత్తు, పరమాత్మను గూర్చిన గుప్తయథార్థజ్ఞానమును వెల్లడించుచు సర్వానర్థమూలమైన యవిద్యను డుల్లించుచు, బ్రహ్మైకమార్గ క్రమముఁ జూపునదే యుపనిషత్తు. శ్రీదేవ్యుపాసనమును బోధించు భావనోపనిషత్తు అరుణోపనిషత్తు త్రిపురోపనిషత్తు మున్నగునవెన్నియో కలవు. గాని, శ్రీసూక్తము తత్తుల్యమేయై వివేషించి స్తుతివర్ణన రహోయాగానుభవములఁ దనలో నిమిడ్చికొని యున్నది. ఇందుపాస్య యేది? ఉపాసనక్రమ మెట్టిది? యనునవి తేల్చవలసి యున్నది. ఉపాస్య శ్రీశబ్దవాచ్యయగు సౌభాగ్య లక్ష్మి, సుభగ = శోభనమైన భగము గలది. ''భగమైశ్వర్య మాహత్మ్య జ్ఞానవైరాగ్యయోనిషు | యశోవీర్యప్రయత్నేచ్ఛా శ్రీధర్మరవిముక్తిషు'' విశ్వకోశము. ఇందు యోనిపదము సకల జన్మస్థానమని గ్రహింపవలయును. లోకాంతర్గతమైన సౌభాగ్యము, చరగతము నచరగతము నీమెరూపము. ''త్రయీమయీ విష్ణుశక్తి రవస్థానం కరోతివై'' త్రయీమ యుఁడు సూర్యుఁడు భగుఁడు తచ్ఛక్తి త్రయీమయి, కావున సుభగ. సుభగయొక్క భావము, సౌభాగ్యము. అది గల లక్ష్మి, కావున సౌభాగ్యలక్ష్మి. శక్తి రహస్యమందు ''పూజ్యతే యాసురైః సర్వైస్తాంశ్చైవ భజ తేయతః| సేవాయం భజతిర్దాతు ర్భగవత్యేవ సా స్మృతా ||'' సురలచే భజింపఁబడునదియు వారలను భజించునది (అనుగ్రహించునది) కావునను సుభగ. ఈ పరాశక్తియే సర్వాంతర్యామిని. గానఁ బిండాండమనఁబడు శరీరమునం దేపేరితో నున్నది? కృత్యము లేవి?యను జిజ్ఞాస కలుగక మానదు. అది తెలియగానే, ఉపాసించుటెటులు? ఫలమేమి? యనియుఁ దెలియఁగోరును. ఆకోరికతోనే సక్రమోపాసన విదానమును దాని ప్రయోజన మును దెలుపఁగల సద్గురువును సద్గ్రంథములను గోరును. అట్టి యుపకారము చేయు గ్రంథములలో శ్రీసూక్తమును 15 ఋక్కుల పొత్తమొకటి. ఇఁక గురుఁడో, షట్చక్రవివేకము, ప్రాణాయామకౌశలము, నిరంతరాభ్యాసము స్వార్థరాహిత్యము, ధనప్రతిష్ఠాశావిముఖత మున్నగు నుత్తమ లక్షణములు గల మహాత్ముఁడే భాగ్యవశమున లభింపవలయును. అపుడే గుప్త విషయములు తెలిసి యానందము గలుగును. గుప్తగాయత్రీ, శ్రీవిద్య, సౌభాగ్యవిద్య, చంద్రకళావిద్య, మున్నగు పేళ్ళతో వెలయు శ్రీమహాత్రిపురసుందరీ మహావిద్యను రహస్యార్థజ్ఞాన దానపూర్వకముగా గురుఁడిచ్చినప్పుడు, ఆ విధానమంతయు ఫలశ్రుతియుతముగా, యోగానుభవసహితముగా, శ్రీసూక్తము, భావనోపనిషత్తు, అరుణోపనిషత్తు, కౌలోపనిషత్తు, సనత్కుమారసంహిత, దక్షిణామూర్తిసంహిత, జ్ఞానార్ణవము, వామ కేశ్వరాది తంత్రములు మున్నగు నెన్నిటినో గల విపుల జ్ఞానమును గ్రమముగా నొందఁగలఁడు. జ్ఞానమునకుఁగల ప్రాధాన్యము కంటెను, జ్ఞానసిద్ధికి సాధనమైన యుపాసనమునకుఁగల ప్రాముఖ్యమే గొప్పది. సోహమ్మనియో సాహమ్మనియో జ్ఞానము కలిగెను బో. అది రూఢిపడి యనుభూతమైనపుడే కదా యానందాకారలాభము. కనుకనే, గీతాచార్యుఁడు శ్రీకృష్ణుఁడును, అధికారియైన పార్థునకుఁదొలుత నాత్మానాత్మవివేకమును, దానికఁబరికరమైన ఫలాభిసంధిరహిత కర్మాచరణవిధియు బోధించి, సాధకవిధులను శాసించి, వెంబడినే ధ్యానయోగమును బ్రాణాయామాదివిధి పూర్వకముగా బోధించి శాసించెను. గాన నుపాసనమునకే ప్రాముఖ్యము. త్రిపురసుందరి భగవతి స్తోత్రప్రియ గాన, విభూతి పారమ్యము లుగ్గడించు నెపమునఁ బ్రధానముగా నాంతరోపాసనానుభవములును దత్ఫలములు నీ శ్రీసూక్త మునఁ దెలుపఁబడినవి. త్రిపురసుందరి యన ననేకనిర్వచనములున్నను, బ్రకృతో పయోగి యగు నర్థమేమన, (పురము = శరీరము) త్రిపురము లనఁబడు స్థూలసూక్ష్మ కారణములనెడి మూడు శరీరము లందును (జాగ్రత్స్వప్న సుషుప్తులనెడి మూ డవస్థలందును) సాక్షిరూపిణియై (జ్ఞానరూపిణియై) శోభిల్లునది. ''ధ్యాత్వాపు೭నర్గచ్ఛతి భూతయోనిం | సమస్తసాక్షిం తమసః పరస్తాత్'' అను శ్రుతివలనను, ''అపిసంరాధనే ప్రత్యక్షానుమానాభ్యాం'' అను వ్యాససూత్ర తద్భాష్యముచేతను, సమస్త సాక్షియైన బ్రహ్మమును ధ్యానించుటచేతనే ముక్తి, యని తెలియుచున్నది, మఱియు - ''గనాం సర్పిః శరీరస్థం న కరోత్యంగపోషణం | నిః సృతం కర్మసంయుక్తం పునస్తాసాం తదౌషధం || ఏవం స హి శరీరస్థ సర్పివత్పర మేశ్వరః| వినాచోపాసనాదేవ న కరోతి హితం నృషు|'' నేయి, యావుశరీరమందున్నంతనే మన పోషణమున కుపయోపడదు. ఆవును బిదికి, పాలు కాచి, తోడుపెట్టి, చిలికి, వెన్నతీసి, నేయిచేసి, సేవించినపుడే మన యంగపోషణము చేయును. అటులే సర్వశరీరములందంతటను వ్యాపించి యున్న పరమేశ్వరుఁడు ఉపాసింపఁబడునపుడే జీవుల ననుగ్రహించి మేలు చేయును. ఈశ్వరానుగ్రహమున నైన పరమార్థజ్ఞానముచే విస్మృత కంఠగత చామీకరన్యాయముగా (అనఁగా మెడయందే యుండి మఱపున వెదకి కొనఁబడు బంగారు నగవలె) తన యందే యుండి యజ్ఞానావరణముచేఁ దెలియబడకుండు పరమేశ్వరుఁడు జ్ఞానోదయము కాఁగానే బ్రహ్మభావ సంపత్తి నొసంగును. ఐహికముగాను నన్నింటఁ దోడుపడును గాన నీశ్వరోపాస్తి యావశ్యకముగాఁ జేయఁదగినది. అది గాయత్రితోనే చేయఁదగినది. ''యా సంధ్యా సైవ గాయత్రీ ద్విధాభూతా వ్యవస్థితా | సంధ్యాచోపాసితా యేన విష్ణుస్తేన హ్యుపాసితః'' సంధ్యాదేవియే గాయత్రీదేవి. గుప్తగాయత్రి ప్రకటగాయత్రి యని రెండు విధములుగా నున్నది. ఆసంధ్య యుపాసింపఁబడెనేని సర్వవ్యాపకుఁడైన పరమేశ్వరుఁడు నుపాసింపఁబడినవాఁఁడగును. శ్రీశబ్దవాచ్యయైన తన శక్తిచే నగు నుపకారము లన్నియు నుపాసకునకుఁ జేయును. సంధ్య యనఁగాఁ జక్కఁగా (తనను గూర్చిన యథార్థ జ్ఞానముతో) ధ్యానింపఁబడునది. సూర్యునందవచ్ఛిన్నమైయున్న చైతన్యమునకును దనకును అభేదభావనమే సంధ్యాపదార్థము. గాయత్రి యనఁగాఁ దన్ను గానముచేయు వారలను గాపాడునది యని యర్థము. మఱియు, (గాయః=ప్రాణము, ప్రాణమును గాపాడునది యనఁగా దీర్ఘాయురారోగ్యములనిచ్చి రక్షించునది యనియు నర్థము) గాన గాయత్రియే, సంధ్య. సంధ్యయే సావిత్రి; సావిత్రియే సరస్వతియై, యిటులు త్రిషవణోపాస్య యగుచున్నది. పరమాత్మశక్తియైన యామెయే నిత్యో పాస్య. ''అహరహః సంధ్యాముపాసీత.'' ''భ్రువోర్ఘ్రాణస్య చ యః సంధిస్తత్రహి సంధ్యాం బ్రహ్మవిద ఉపాసతే'' ప్రతిదినమును మువ్వేళల సంధ్యానామక గాయత్రి నుపాసింపవలయును. ముక్కు కనుబొమలు ననువాని చేరిక గల చోటే సంధి. అదె యాజ్ఞాచక్రము. ఆ సంధియందు ధ్యానింపఁబడునది కావుననే సంధ్య. బ్రహ్మజ్ఞాను లామె నచటనే యుపాసింతురు. ఎటులనఁగా ''న భిన్నాం ప్రతిపద్యేత గాయత్రీం బ్రహ్మణాసహ, సో೭హమస్మీ త్యుపాసీత విధినా యేన కేన చిత్.'' వేదమాతయైన గాయత్రిని బ్రహ్మముకంటె వేఱుగాఁ దలంపక సద్గురూపదిష్టమైన యే దే నొక విధిచేత ''నేనతఁడే'' యను బుద్ధితో, అనఁగా, 'నేను' అను జీవాత్మకంటె, 'అతఁడు' అను పరమాత్మ వేఱు కాదను భావముతోనే యుపాసింప వలయును. (వ్యాసులు) ''బ్రహ్మాద్యాకారభేదేన యా೭భిన్నా కర్మసాక్షిణీగాయత్రీశ్వరశక్తి స్సాసంధ్యేత్యభిహితాబుధైః'' - అను భారద్వాజస్మృతిచేతను, సర్వసాక్షిణియై బ్రహ్మాభిన్నయైన యీశ్వర శక్తియే గాయత్రియు సావిత్రియు ననఁబడినది. ఆమెయే త్రిపురసుందరి. ''గాయత్రీ సశిరా స్తురీయసహితా సంధ్యామయా త్యాగ మైరాఖ్యతా త్రిపురేత్వమేన మహతాం శర్మప్రదాకర్మాణం'' 'పరో రజసి సావదోమ్' అనెడి నాల్గవపాదముతోఁగూడిన గాయత్రియే సంధ్యాసర్వరూపిణి యని యాగమము లనుచున్నవి. ''అమ్మా! త్రిపురాంబా ! సంధ్యాగాయత్రీనామములు గల నీవే నీయుపాసనకర్మఫలముగా నానందప్రదవగు చున్నావు'' అని యభియుక్తోక్తి. అట్టి యభేదబుద్ధితో దృఢధ్యానము చేసినపుడు సర్వసమ్మత సర్వకారణ బ్రహ్మప్రాపకత్వ మామెదే యగును. ''ఉద్యంత మస్తం యంత మాదిత్య మభిధ్యాయ& కుర్వన్ బ్రాహ్మణో విద్యా& సకలం భ్రదమశ్నుతే అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైన స& బ్రహ్మాప్యేతి| య ఏవం వేద'' ''గాయత్రీ వా ఇదం సర్వం రర్కజ్యోతిరసావహోమ్'' నిత్యముజరుగు సంధ్యావందనమందుచ్చరిపబఁడు నీమంత్రములు సైతము పైవిషయములనే గదా ప్రతిపాదించుచున్నవి. కావున గాయత్రీరూపవేదమాతయు బ్రహ్మశక్తియునైన శ్రీమహాత్రిపుర సుందరియే యుపాసింపఁదగినది. యోగులెల్లరు నాపరాశక్తినే ధ్యానయోగవ్యవసాయమున దర్శించి యానందమయులైరి ''న తస్య కార్యం కారణం చ విద్యేతే న తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే| పరాస్య శక్తి ర్వివిధ్యైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ| తే ధ్యానయోగానుగతా అపశ్య& దేవాత్మశక్తింస్వగుణౖర్నిగూఢాం'' బ్రహ్మముయొక్క యీపరాశక్తి తన్నుఁబోలినదిగాని తన్ను మించినదిగాని మఱియొకటి లేనిదై, బ్రహ్మమును స్వభావముతోనే చేరియుండి యిచ్ఛాజ్ఞానక్రియాశక్తి రూపయైపలు తెఱుంగులుగా నున్నది. ఆ దేవాత్మశక్తినే ధ్యానయోగులుపాసించి దర్శించిరి. మఱియు- ''అపరేయమిత స్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్||'' అను గీతాస్మరణమును బట్టి యపరాననామయైన జీవభూతశక్తియై యున్నదియు నాపరాశక్తియే. జీరూపముగా సర్వోపాధులందును జొచ్చి నామరూపములతో వ్యాపించినది. ''తదను ప్రవిశ్య, సచ్చత్యచ్చాభవత్| ఏక స్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బభూవ| ఏకధా బహుధా చైన దృశ్యతే జలచంద్రవత్'' నామరూపసహితజగత్తుగా మాఱి నదియు, ఆయాయుపాధులదు అంతరాత్మరూపముగా నొప్పు చున్నదియు గాయత్రీనామక పరాశక్తియే యని యీశ్రుతుల యభిప్రాయము. ''సైషా షోడశీ శ్రీవిద్యా పంచదశాక్షారీ'' యన్నది మొదలు ''గాయత్రీ సావిత్రీ బ్రహ్మానందకలా'' యను మాటతో ముగియు బహ్వృచోషనిద్వాక్యముల వలనను, త్రిపురాతాపనీయమందు శ్రీవిద్యయందైన ప్రతికూలమును బూర్ణగాయత్య్రర్థసమన్వయము గలదిగాఁ జెప్పుటవలనను సూక్ష్మతర గాయత్రీరూప శ్రీవిద్యయే మహాలక్ష్మీభావముతో నుపాసింపఁదగినది. శ్రీదేవియే యుపాధులందు ఆత్మరూపముగానున్నదనుటను సావిత్రీదేవి యామెయే యనుటను ''శ్రీతత్త్వ మనెడి తాంత్రిక'' గ్రంథమందెటులుగ్గడింపఁబడెనో చూడుఁడు. ''సూర్యామైశ్వర్యరూపాం చ సావిత్రీం సూర్యరూపిణీమ్| ఆత్మసంజ్ఞాం చ చిద్రూపాం జ్ఞానదృష్టిస్వరూపిణీమ్| చక్షుః ప్రకాశకాం చైన హిరణ్యప్రచురాం తథా| స్వర్ణాత్మనావిర్భూతాం చ జాతమేదో మ ఆవహ||'' సూర్యుఁడధిదేవతగాఁ గలదియు, అన్నిటిని బ్రసవించునదియు, ఐశ్వర్య రూపిణియు, సర్వశక్తిస్వస్వరూపిణియు, సూర్యస్వరూపముకంటె వేఱుకానిదియు (చక్షుః అనునుపలక్షణముచే) సర్వేంద్రియములను బ్రకాశింపఁజేయు నదియు, ఉపాధులం దాత్మరూపముతో నొప్పునదియు, జ్ఞానస్వరూపిణియు, లోకమున సువర్ణరూపముగా (ఉప్పలక్షణముచే స్వర్ణరజతధనధాన్య గృహారామాదిరూపముగా) నున్నదియు, నైన శ్రీదేవిని ఓపరమేశ్వరా! నా కొరకాహ్వానింపుము.'' ఇదె శ్రీసూక్తము లందలి భావమని మున్ముందు మీరు గ్రహింపఁగలరు. ఇంకొక మాట; గాయత్రీమంత్రమందలి 'భర్గఃశబ్దము' (సకారాంత నపుంసకలింగము) 'తేజస్సు' అను నర్థమిచ్చునది. అదె స్వాత్మాభేదముతో ధ్యానింపఁదగినది. మరియు, ''నిరుపాధికీ సంవిదేవకామేశ్వరః| సదానంద పరిపూర్ణా స్వాత్మైన పరదేవతా లలితా | భగఃశక్తిః | భగవాన్కామ ఈశః'' ''న తత్ర సూర్యోభతి న చంద్రతారకం నేమావిద్యుతో భాంతికు7తోయమగ్నిః| తమేవ భాంతియను భాతి సర్వం | తస్య భాసా సర్వమిదం విభాతి|'' అను శ్రుతులనుబట్టియు ధ్యేయయైనది పరమానందపరిపూర్ణయు, స్వయం ప్రకాశము, సర్వప్రకాశకయు, ఆత్మస్వరూపిణియు, నన్నటిని మీఱి ప్రకాశించునదియైన పరదేవత శ్రీమహాత్రిపురసుందిరియే. గాయత్రీమంత్రమందలి భర్గశ్శబ్దముచేఁ దెలియందగినది యా లలితయే. ''సచ్చిన్మయః శివస్సాక్షాత్తస్వానందమయీ శివా'' అనెడి స్మరణమునను, ''అహికుండలవత్తదుపపత్తేః'' అనెడి సూత్రమువలనను, ఆత్మస్వరూపయై పిండాండమందు గుండలినీపరాశక్తియై, యానందస్వరూపిణియయిన లలితాంబికయే శ్రీశబ్దవాచ్యయయిన ఉపాస్యదేవత. చిదానందస్వరూపబ్రహ్మముకంటెను వేఱు గాక, భోగమోక్షప్రదయయిన యామె నుపాసించునప్పటి యనుభూతలక్షణములే స్తుతిప్రార్థన రూపమున శ్రీసూక్తమందును సౌభాగ్యవిద్యాహృదయమందును సృష్టీకృతములు. ఇవి మంత్రి రహస్యార్థవివరణమందు మీరు కాసఁగలరు. ''వరేణ్యం భర్గః'' పత్నీ భావముతోఁగాంక్షణీయమైన ''తద్భర్గః'' ఆ శివకామేశ్వరీనామకమహస్సే పరమేశ్వరిని విమర్శశక్తి. ''స్తుమః పుంవత్కరం కించి దరుణం తరుణీమయం| కలా పంచదశారబ్ధం కమనీయం పరం మహః|| తన్మహః పరమం నౌమి కృత్యైః పంచభిరంకితం | అశేషవిశ్వభేదాత్మ పూర్ణానందాత్మకం శివం || త్రిధా విభక్తం యద్వస్తు స్తోతృస్తుత్యస్తుతిక్రమాత్ | ఏకసై#్మ మహసే తసై#్మ నమః సకలచక్షుషే || స్మరామి తాం పరాం వాచం పశ్యంత్యాదిక్రమాంశ్రయాం|| నానావిధమహాకారరనుభవకారణాం || దేశకాలపదార్థాత్మా యద్యద్వస్తు యథాయథా | తత్తద్రూపేణ యా భాతి తాంశ్రేయే7హం విభోఃకలాం''|| పురుషునివలెనే సర్వప్రకృష్టములైన సృష్టిస్థితిసంహారతిరోధా నానుగ్రహము లనెడి కృతులను జేయునదియు, మనోవాక్కుల కందనిదియు, స్త్రీ రూపముగా నన్నెఁబడినదియు, వరేణ్యమై నదియు, పదునేను చంద్రకళలకు మూలమై తాను బదునాఱనదియై ''సాదా, పరా'' నామములతోఁ జెల్లునదియు, విశ్వమందలి సర్వస్వరూపములుఁదానయై, వానియందాత్మరూపమున శోభిల్లునదియు, నైన యా యరుణభాసను, పరమానంద స్వరూపిణిని స్తుతించుచున్నారు. స్తుతించువాఁడు, స్తుతింపఁబడునది, స్తుతి యనెడి మూడునుఁ దానయై, సర్వసాక్షిణియయిన యా శివతేజస్సునకు మ్రొక్కుచున్నాను. పిండాండ మందుఁ బశ్యంతీ మధ్యమా వైఖరి నాదస్వరూపములతో నలరుచు సర్వవిధానందముల నునుభవించు నాపరానాదస్వరూపను ధ్యానించుచున్నారు. దేశము కాలము చరాచరవస్తు వులుఁ దనరూపముగాఁబ్రకాశించు నాబ్రహ్మశక్తినే ప్రాపుగొనుచున్నాను''అని -అని దేవీపారమ్యమును. ''ములాదిబిలపర్యంతం మహాత్రిపురసుందరీమ్, యా తను స్తే తటిత్ప్రఖ్యాతాం భ##జే భవనాశినీమ్'' మూలాధారమునుండి బ్రహ్మభిలపర్యంతమును (కులము, శ్మశానము అను పేళ్ళుగల సుషుమ్నాపదవియందు) మెఱుపుఁ దీవవలె శోభిల్లుచు మహాత్రిపురసుందరివై మోక్షదాయినినైన నిన్ను సేవించుచున్నాను - అని పిండాండమందలి దేవీశోభను, ''యోనౌ కనకపుంజాభం హృది విద్యుచ్చయోజ్జ్వలం| అజ్ఞాయాం చంద్రసంకాశం మహస్తవ మహేశ్వరి|| ప్రసృతా తామృతరత్నౌఘ సంతర్పితచరాచరాం | భవాని భవశాంత్యై త్వాం భావయామ్యమృతేశ్వరి||'' మూలాధారమందుఁ బుటము పెట్టిన బంగారు కాంతితోను. హృదయమనెడి యనాహతమున మెఱుపుఁ దీవల మొత్తపు మిలమిలలోను, అజ్ఞాచక్రమందు జంద్రుని కాంతివంటి కాంతి తోను, నీవు ప్రకాశింతువు. నిన్ను సహస్రారచక్రమందుఁ జేర్చి ధ్యానించు సాధకుల నాడీమండలమును అమృతముతో (ఆనందరసముతోఁ) దడిపి తనియించునపుడు అమృతేశ్వరి యను పేర నొప్పు నిన్ను సంసారతాపశాంతికై యుపాసించుచున్నాము. - అని ప్రధాన చక్రములందు యోగిరాజు లనుభవించు శ్రీదేవీ తేజఃస్వరూపమును, సౌభాగ్యహృదయమందెంత చక్కఁగా వివరించినాఁడో చూడుఁడు. శ్రీ శివానందయోగీంద్రుని యీయమూల్యవాగ్రత్నములను బట్టియు ''వరేణ్యం భర్గః'' యనునది బహిరంతర్వ్యా పినియైన పరాశక్తి లలితాంబయే గదా. అదె కమనీయ పరమహస్సు. ''అయ్యా! గాయత్రి బ్రహ్మప్రతిపాదకము గదా. దేవీ ప్రతిపాదక మెట్లందురేని'' వినుఁడు. ''స్త్రీరూపం చింతయే ద్దేవీం పుంరూపం వా విచింతయేత్ | అథవా నిష్కలం ధ్యాయే త్సచ్చిదానందలక్షణం||'' అను జ్ఞానార్ణవస్మరణమువలన దేవిని స్త్రీరూపమునైనఁఋరుషరూపముననైనఁ గేవలసచ్చి దానందలక్షణనుగానైన, ధ్యానింపవలయును. సకలజననియైన యాశిశక్తియే శ్రీఘ్రప్రసన్న యగుటచే స్త్రీ రూపమునకే ప్రాధాన్యమీఁబడి, సంధ్యాగాయత్రీ సరస్వతీ లక్ష్మీ, కాళీ, మహాత్రిపురసుందరీత్యాదినామములతో శ్రుతిస్మృతి పురాణాగమాదులందు బహుళః వ్యవహరింపఁబడి జీవులచే నుపాసింపఁబడుచున్నది. 'సవితుర్భర్గః' యనునపుడు కేవలప్రత్యక్షసూర్యతేజస్సే యనరాదు. అన్నింటిని బ్రసవించునది యను నర్థమిచ్చు సవితృపదము జగత్కారణవాచి. ''భేతి భాసయతే లోకా& రేతి రంజయతే జనాన్, గ ఇత్యాగచ్ఛతే7జస్రం భరగో భర్గ ఉచ్యతే||'' అను యోగి యాజ్ఞవల్క్యస్మరణమువలన - సర్వలోకములను బ్రకాశింపఁజేయునది, సర్వభూతములను రంజింపజేయునది, జగద్రూపమునొందుచుండునది, కాఁగా భర్గమామెదే. ఆ భర్గమామెయే, ఆమెయే పంచకృత్య పరాయణ. ''సృష్టికర్త్రీ బ్రహ్మరూపాగోప్త్రీ గోవిందరూపిణీ, సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ, సదాశివానుగ్రహదా పంచకృత్యపపరాయణా'' - నామస్మరణము కావున నా తేజస్సు ప్రత్యక్షసూర్యతేజస్సే యన్నచో, ''న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం| భీషో7స్మాద్వాతః పవితే | భీషోదేతి సూర్యః|| అక్కడ సూర్యచందనక్షత్రాదులు ప్రకాశింపవు. దానికి భయపడియే సూర్యుఁడుదయించును. వాయువు వీచును'' అను శ్రుతులకు విరోధమగును గాఁన గేవలసూర్య తేజస్సే ముఖ్యోపాస్యము కాదు. ''సవితా దేవతా'' యను శ్రుతివలనఁ బుంరూపమే ప్రధానమనియు ననరాదు. గాయత్రీ మంత్రమునకు సంధ్యా (చక్కఁగానాజ్ఞాచక్రమందు ధ్యానింపఁబడు) చిచ్ఛక్తియే దేవత. ఈ ప్రత్యక్షసూర్యఁడధిదేవత. గాన సూర్యుని యధిదేవతాత్వమును దెలుపునదే యామాట. మఱియు గాయత్య్రావాహనమంత్రమఁగు ''ఆయాతువరదా దేవీ అక్షరంబ్రహ్మమ్మితం| గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జూషస్వమే|| ఓజో7సి , సహో7సి, బలమసి, బ్రాజో7సి, దేవానాం ధామ నామాసి, విశ్వమసి, విశ్వాయుః, సర్వమసి సర్వాయుః, అభిభూరోమ్'' గ్రాయత్రీ మవాహయమా, సావిత్రీ మావాహయామ, సరస్వతీ మాహమయామి శ్రియ మావాహయామి - ఇత్యాది శ్రుతులవలన, అమ్మా! నాయోజస్సు, బలము , కాంతి, ఇంద్రియప్రకాశము, ఓర్పు, ఆయువు, ఇది యది యనక సర్వము నీవ. గాయత్రియని, సావిత్రియని, సరస్వతియని శ్రీదేవి యని నిన్నే యాహ్వానించు చున్నాను. అని యమ్మహాత్రిపురసుందరి నుద్దేశించియే సాధకుఁడను చున్నాఁడు. ''అయినను, మహాత్రిపురసుందరియే గాయత్రి యననెట్లు యుక్తమందురేమో'' వినుఁడు. ''యత ఆవాహయేద్దేవీం తత్త్రైవోత్సర్జయే త్క్రమాత్'' ఎక్కడి నుండి దేవి నాహ్వానించితివో అక్కడనే మఱల విడిచి పెట్టవలయు ననుటచేత, మూలాధారకులకుండమందు ముచ్చుట్లతో నుండు దేవిని బ్రాణామాయప్రయత్నమచే మేల్కొల్పి, వివిధ చక్రములందు నిల్పుచు, వివిధోపచారములు చేయుచుఁ బరమశివస్థానమైన సహస్రారమునకుఁగొంపోయి, యచటనగు నానందామృత సేచనమచేఁఁ దనిసి తనిపి మఱల స్వస్థానమగు కులకుండమందుఁ జేర్పవలయును. ఇదియే సమయాచారము. గాన అవాహన మంత్రముచేతను, ఉపస్థానమంత్రముచేతను శ్రీరాజరాజేశ్వరియే గాయత్రీదేవత యని సిద్ధమగుచున్నది. దేవీ=ప్రకాశించువాఁడు దేవుఁడు, అతని స్త్రీ దేవి. ''రాజాగ్యమహిషీ దేవీ'' అని కోశము; గాన శ్రీరాజరాజేశ్వరియే. వరదా=కోర్కులనిచ్చునది. ''తాపాపహారిణీం దేవీం భక్తిముక్తి ప్రదాయినీం'' అని స్మరణము. వరం=పరమశివుని (తురీయపరమపురుషార్థమైన ముక్తిని) ఇచ్చునది. ''ముకుందా ముక్తినిలయా'' అని నామస్మృతి. అక్షరం=నాశము లేనిది, మఱియు ప్రణవవర్ణస్వరూపిణి, ''ఓమోమ్ వాచి ప్రతిష్ఠా'' అని శ్రుతి, మఱియు మాయా బీజాక్షరరూప, ''హీంకారిణీ'' ''హీంకార ఉభయాత్మకః'' అని స్మృతి. ఈ హ్రీంకారము బ్రహ్మమునకును బ్రహ్మశక్తికినిఁ జెల్లును. కామకళా (ఈం) రూపమనియు నర్థము. ''బ్రహ్మసమ్మితం=పరమశివునితో స్థితియందును గృతి యందును సమానయైనది. ''సమప్రధానౌ సమసత్త్వౌ సమోతయోఃసమశక్తిః||'' అని శ్రుతి. ఇటులే శివకామేశ్వరులకు ననే కాగమములందును సామరస్యమే ప్రపంచింపఁబడి యున్నది. ఇందు అక్షరం, బ్రహ్మసమ్మితం, అను చోట్ల సపుంసకత్వము ఛాందసము. (వేదమం దుంగీకృతము) చందసాం మాతా=సర్వవేదములనకును (జ్ఞానములకును తల్లి. ఈమె నాహ్వానించుటయు, నీమె వచ్చుటయు నెందుల కనఁగా, దేవీత్వం= స్వయంప్రకాశవును, రాజరాజేశ్వరివియునైన నీవు, మే+బ్రహ్మ=నా జపధ్యాన పూజాదికరూపమైన తపస్సును, (''వేదస్తత్వం తపో బ్రహ్మ'' అని కోశము) జుషస్వ=స్వీకరింపుము. అమ్మా! జపధ్యానాదికరూపమైన మా సేవనంగీకరించి భుక్తిముక్తి ప్రదాయినవై మమ్ముఁగాపాడుమని ప్రార్థించుటకే. ఇఁక ఉపస్థానమంత్రమందు ''ఉత్తమే శిఖరే దేవీ భూమ్యాం పర్వతమూర్థని, భ్రాహ్మణభ్యో7భ్యనుజ్ఞాతా గచ్ఛ దేవీ యథాసుఖమ్|'' పర్వతమూర్ధని=మహామేరుపుమీది భాగమున; ఉత్తమే శిఖరే =మిక్కిలి యెత్తైన శృంగమున, భూమ్యాం= అంతస్తు నందు; (అనఁగా శ్రీపురాంతర చిన్తామణి గృహప్రసాదా గ్రిమప్రదేశమందు-(సహస్రారాంతగర్గతమధ్య బిందుత్రికోణస్థానమున - అని రహస్వార్థము). దేవీ= ప్రకాశించుదానవును (శివునితో) క్రీడనశీలవునునైన; దేవి= శ్రీమహాత్రిపురసుందరీ! బ్రాహ్మణభ్యః=బ్రహ్మజ్ఞానులవలన; అభ్యనుజ్ఞాతా=సెలవు గొన్నదానివై; యథాసుఖం= సుఖముగా; గచ్ఛ=(స్వస్థానమైన) ములాధారకులకుండముకుఁ బొమ్ము. ఇట, సాధకుఁడు, కుండలినీపరాశక్తిస్వరూణి యగు శ్రీమహాత్రిపురసుందరిని బ్రాణాయామక్రియచే మేల్కొలిపి సహాస్రారమునకు గొంపోయి తన సాధనము ముగియఁగానే, మఱల స్వస్థానముఁజేర్చుపనులమాటయే ''యత ఆవాహయే ద్దేవీం తత్త్రైవోత్సర్జయేత్క్రమాత్'' అను విధియందును సమన్వయించుచున్నది. ''యా సంధ్యా సా చ చిద్రూపామాయాతీతా సునిశ్చలా, ఈశ్వరీ కేవలా శక్తిస్తత్త్వత్రయసముద్భవా, కేశవిష్ణుస్వరూపిణ్యౖ సంధ్యే దేవినమో7స్తుతే||'' అను నీవందనస్తుతిని బట్టియు సంధ్యాదేవియే త్రిపుసుందరి. ఆమెయే సౌభాగ్యలక్ష్మి. కావున నామెనుపాసించునదే సౌభాగ్యవిద్య. ఆయుపాసనక్రమముం దెల్పుచు నామెపేర వెలసినదే సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు. సుభగ సౌభాగ్యపదములు వెనుకనే వివరింపబడిఁబడినవి. అయ్యుపనిషత్తునందుఁ బ్రాణాయామవిధియు, అందు ముఖ్యముగాఁ గుంభకస్థితియుఁ దెల్బబడినవి. ఏమంత్రముతో నేదేనతపేర బ్రహ్మవస్తు వుపాసింపఁబడినను బ్రాణాయామ విధ్యుక్త కుంభకస్థితియే ప్రధానము. అగస్త్యునకు ''కుంభసంభవుఁడ''ని పేరు. పౌరాణికార్థమెటులన్నను బరమార్థమేమనఁగా కుంభ=నాయుకుంభనమందు, సంభవః= చక్కఁగా నిల్చిన వాఁడు=అనఁగా, వాయువును గుంభించు పనియందాఱితేఱిన వాఁడు. శ్రీవిద్యను హయగ్రీవస్వామి అగస్త్యునకు సమగ్రముగా నుపదేశించుటకు హేతువిదియే. అనఁగాఁ బ్రాణాయామ మందుఁ గుంభకస్థితిని నిల్చునభ్యాసము లేనివానికి శ్రీవిద్య యిచ్చిన లాభము లేదని తాత్పర్యము. కనుకనే గాయత్రీ మంత్రోపదేశ కాలమగు నుపనయనవేళనుండియుఁ బ్రాణాయామాభ్యాస మానశ్యకమని తోఁచును గదా. చిననాఁటి గాయత్రియు శ్రీవిద్యయే. శ్రీసూక్తమందుఁ జెప్పబడిన ఫలములను కోరు శ్రీకాముఁడును కుంభసంభవుడు గావలయు ననుమాట మఱువరాదు. ఈ లక్ష్మీదేవియే శ్రీశబ్దవాచ్య. శ్రీం లక్ష్మీబీజము. కావుననే శ్రీవిద్య. ''అయ్యా! సౌభాగ్యవిద్యయనునదే శ్రీవిద్య, యనుచున్నారే. అందు లక్ష్మీజీజయే కానరాదందురేమో'' వినుఁడు. 'చత్వార ఈ భిభ్రతిక్షేమమంతః' అని గదా విద్యాలక్షణము. నాలుగు ఈంకారములుండవలయును. అందుఁ దుదిది లక్ష్మీబీజము కావలయును. ఇపుడు చిత్తగింపుఁడు. క ఏ ఈ ల హ్రీం, హనకహలహ్రీం, సకలహ్రీం, అను మూడుఖండములుగాఁ గానవచ్చు పంచదశాక్షరసౌభాగ్యనివ్యయే కాదివిద్య. ఇదే కాముఁడుపాసించినది. ''మనుశ్చంద్రః కుబేరశ్చలోపాముద్రా చ మన్మథః | అగస్తి రగ్నిః సూర్చశ్చ ఇంద్రః స్కందః శివ స్తథా| క్రోధభట్టారకో దేవ్యాద్వాదశా7మీ ఉపాసకాః'' కావున మన్మథుడు శ్రీవిద్యోపాసకుఁడు. శ్రీశంకభగవత్పాదుల సౌందర్యలహరి 5, 6 శ్లోకములు (నావివృతి) చూడుఁడు. సరే : ఇందలి మూడు హ్రీంకారములందు మూడు ఈంకారములే కాని నాలుగవది యేదీ? యనియు, ప్రథమ ఖండమున మూడవవర్ణము ఈకారమే కాని ఈంకారము కాదే యనియు శంక పోడమును, చూడుఁడు. ప్రథమఖండమున ఈ కారము గలదు గదా? ఏకారాంతమున సూక్ష్మముగా వినవచ్చు అ కారమునకు బిందుత్వ మంగీకరింపఁబడి సిద్ధమనిరి. 'ఏజః పదాంతాదతి'యను సూత్రమువలన నిదిలభించుచున్నది. సూక్ష్మముగా బ్రథమకూటమందలి ఈకారముతోఁ జేర్చినపుడు 'ఈం' అను నది నాల్గవది లభించినది. గానఁ బ్రత్యేకముగా శ్రీం బీజమునక్కఱ లేకయే సౌభాగ్యవిద్య యనఁబడు పంచదశాక్షరియే షోడశాక్షరీవిద్యగా నంగీకరింపబడినది. ''సైషా షోడశీ శ్రీవిద్యా పంచదశాక్షరీ'' అని శ్రూత్యామ్నాతము. ''అటయినచో నాడాడ శ్రీంబీజముతోఁజేరిన పంచదశాక్షరి, షోడశాక్షరిగాఁ గాన వచ్చునే? దానికఁగతి యేమి'' యందురో? అది హయగ్రీవోక్తమైన విద్యాంతరముగా భానురానందనాథాదులు స్వీకరించిరి. సరియే; ''చత్వార ఈం బిభ్రతి'' యనెడి శ్రుతివలన నీవిద్య నాల్గుఖండములు గలదిగాఁ దోఁచునే; అది యెట్లందు రేని,-అవును, ''విద్యాకూటై శ్చతుర్భిశ్చ గాయత్య్రా చతురంఘ్రిభిః| సమ్మేలనేన యో జాపః కోటికోటిఫలప్రదః||'' అను స్మరణమువలన, నాల్గవ ఈంకారమే నాల్గవ ఖండముగా నెన్నుకొని, విద్యయొక్క నాల్గుకూటములతోను, గాయత్రి నాలుగు పాదములను సంపుటితము చేసి జపించుట కోటిఫలప్రదమనుటచే సౌభాగ్యవిద్యకును నాలుగుకూటములు గలవనుటయే. నాలుగవ కూటమైన ''పరోరజసి సావదోమ్'' అను దానిఁ జేర్చి జపింపవలయుననుట. పై విధముగా లభించిన లక్ష్మీవాచకమైన ఈంకారమే షోడశీకళ. ఇదే శ్రీలక్ష్మీబీజము. ''ఈకారో7బ్జదళే లక్ష్యాం వాణ్యాం కమలకేసరే'' అని రత్నమాలాభి ధానము. మఱియునది వాణివాచకమగుటచేతన, ఈంకారమును గుప్తమహారసారస్వతబీజమనిరి. చంద్రుని కళలు పదునాఱు. అయినను, ప్రతివాదాతిథి రూపలైనవి పదునైదే. శుక్లకృష్ణపక్షములందు వృద్ధిక్షయ రూపముతో గానవచ్చుచున్నవి. గాని పదునాఱవ కళ కాదు. అది నిశ్చలయై పెఱుగు తఱుగులు లేక పరా - సాదా - మహా నైసర్గికీత్యాదినామములతోఁ జెల్లును. అద్దానికే క్షయమున్నచో, అమాంతమునఁ జంద్రునికే నాశప్రసంగము గలుగును. గానఁజంద్రుని పదునాఱవ కళ సర్వకళలకును బీజభూతమై, సర్వకళామయియై, హానివృద్ధులు లేనిదై, పంచదశతిథి రూపకళలందిమిడి యున్నది. కావుననే దీనికి 'సాదా' (సదాయుండునది) యని పేరు. ఇదియే బ్రహ్మస్వరూపము. ఆరాధింపఁబడు ప్రధానకళ యిదియే కావున దీనికిఁ జంద్రకళావిద్యయని పేరు. ఈ పదునాఱవ కళ##యే తక్కుపదునైదింటిని దన నుండి విడుచుచుండును. గావునను సర్వజగత్కారణము కావునను ''మహావైసర్గకీ'' యను పేరుతోఁజెల్లుచున్నది. సర్వోత్కృష్టబ్రహ్మకళ కావుననే 'పరా' యని పేరు. శ్రీమహాత్రిపురసుందరిని జంద్రునందుపాసింపుమనుటకును, ఈ గాయత్రీమహవిద్యకు 'చంద్రవిద్య' యను పేరు వచ్చుటకును, ''చంద్రమండలవిద్యగా, చారుచంద్రకళాధరా'' మున్నగు నామములు శ్రీదేవికి సర్వాగమములందుఁజెల్లుటకును నిదియే కారణము. ఈషోడశీకళ శరత్కాలమందు శశి బింబమును వ్యక్తతరముగాఁ దోఁచును గావుననే. అప్పటి చంద్రకిరణములకు వ్యాధిహరశక్తియు విశేషించి యుండును. గాన శరచ్చంద్రకిరణములు సేవ్యములనిరి. శరత్తున వచ్చు నాశ్వియుజ కార్తిక పూర్ణిమలందు సర్వవర్ణములవారును జంద్రునారాధించుట, యీ రహస్యము నెఱింగినమన పెద్దలు శాసించిరి. బ్రహ్మాండమందఁ జంద్రమండలము జహిర్యాగయోగ్యము; పిండాడమందు, అజ్ఞాది సహస్రారాంతమైన చంద్రమండలము అంతర్యాగయోగ్యము. ఇక్కళలు సూర్యతేజస్సు (భగ్గః) నుండి వెల్వడి చంద్రుని సంక్రమించును గావుననే శ్రీమహాత్రిపురసుందరి సూర్యమండలారాధ్య యయ్యెను. ''భానుమండలమధ్యగా, భాగారాధ్యా'' యని దేవీరామస్మరణము. మన శ్రీసూక్తమంత్రములలో ''సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం'' అనియు, ''చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం అనియు స్తుతింపఁబడుటకుఁ గారణమైనది. అటులే షోడశీకళ##యైన లక్ష్మీబీజరూపమైన, (పైనుద్ధరింపఁబడిన) ఈంకారమే శ్రీవిద్యయందు సర్వబీజరూపమై, పంచదశార్ణములయం దంతర్భూతమై యున్నది. కనుకనే శ్రీసూక్తమందు ''పద్మినీ మీం (పద్మినీం=ఈం) శరణ మహం ప్రపద్యే'' అని లక్ష్మిరూపముగా సూక్ష్మోపాసనమం దుపాసింపఁ దగినదియే యని వేఱ చెప్పనేల? పద్మినీం=(పద్మములుగల) మూలాధారాది చక్రసంచారము చేయునపుడు పద్మలతను బోలిన, ఈ=లక్ష్మీరూపయైన ఈం బీజవాచ్యమైన శ్రీమహాత్రిపురసుందరిని, అహం+శరణం= ప్రపద్యేనేను శరణు జొచ్చుచున్నాను-అని యర్థమ. మరియు, సౌభాగ్య శ్రీబీజమైన 'ఈంకారమే' శ్రీచక్ర బిందుస్థానమున న్యసింపఁబడి తన గొప్పదనమును జెప్పుకొనుచున్నది. ''న గాయత్య్రాః పరం మంత్రం మాతుః పరదైవతమ్'' శ్రీమాత, సకలజనని, మతృకా వర్ణాత్మిక. (శబ్దబ్రహ్మస్వరూపిణి)యైన శ్రీమహాత్రిపురసుందరికంటెనుత్కృష్టయు, శ్రయణీయము వేఱొక్క దైవతము లేదు. ఆమెను బ్రసన్నను జేసికొని భుక్తిముక్తులందుటకు సూక్ష్మతరగుప్తగా గాయత్రి యనెడి సౌభాగ్యవిద్య యనెడి, పంచదశాక్షర మహావిద్యను మంచి నదియు లేదు. సౌభాగ్యలక్ష్మి నామాంతరము గల శ్రీమహా త్రిపురసుందరియే శ్రీదేవి. ''కృషితో నాస్తిదుర్భిక్షం జపతో నాస్తి దుర్లభం'' కార్తెల వేళ లెఱింగి వ్యవసాయము చేయువానికిఁ గఱవు లేదు. ఉపనిషదుక్తక్రమమున జపాదికముతో భగవతి నారాధించువానికిఁ బొందరానిదియు లేదు. దీని నింతటితో ముగించుచున్నాను. శ్రీమాతృకృపావలంబమున నాప్రకాశింపఁజేయనున్న శ్రీవిద్యామంత్రభాష్యము (తెనుఁగు)న, నింకను ననేకవిషయములు కంటఁబడును ఈ వ్రాసినదాన ననేకపదములు, వాక్యములను, వ్యాఖ్యానమును గోరుచున్ననని యెఱుఁగుదును. ఈ గ్రంథము నింతకును బెంచి వ్రాయుటకు, ఈంకారిణి నాకుఁ దోడ్పడును గాన, యిందింతకంటెను వీలు చిక్కదు. ఇఁక మీరు చదువఁబోవు గ్రంథము, బుక్కుల రెండర్థముల దెల్పును. మొదటిది ప్రకటార్థము. జనసామాన్యమునకు సులభముగాఁ దెలియును. శ్రీదేవీస్థూలోపాసనమును దెలుపును. రెండవది రహస్వార్థము. సూక్ష్మపరోపాసనములను దెలుపును. ఇందే మంత్రములలో స్తుతివర్ణన రూపముగానున్న రహోయాగవిశేషములు వివరింపబడినవి. మంత్రద్రష్ట బుక్కులందుఁ గొన్నిటఁ బరమేశ్వరరూప జాతవేదుని సాయమునఁ గొన్నటి శ్రీవిద్యోపాసనసిద్ధులైన వారి సాయమును గోరును. కొన్నిటఁ దానే చనవునఁ బిలుచును. మఱియుఁ గొన్నిటి నుపాసనసిద్ధికి వలయు పరికరములను స్థలములను సూచించును. చదువరులు శ్రీసూక్తప్రకట గుప్తార్థముల తత్త్వము నెఱింగి 'కష్టీ ఫలీ' యని తెలిసి యుపాసించి భావిసంతతుల కుపాసనక్రమమును బోధించి మాసకలజనని కరుణకుఁ బాత్రులయి భుక్తిముక్తుల సందెదరుగాక. ఈసందర్భమున నొక్కమాట వ్రాయక తప్పదు. నా యీ రహస్వార్థమును వినిన మిత్రులు కొందఱు, శ్రీ సూక్తము త్రివర్గఫలదమే కాని మోక్షప్రదము కాదని వాదించుచున్నారు. వారు శ్రీసూక్తోపాసన బోధమునే చేయఁబుట్టిన ఋగ్వేదీయ సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తును జూచినవారు కాదు. అద్దాని ఫలస్తుతియందు ''నసపునరావర్తతే, సనపునరావర్తతే'' యను మాటను ''నిష్కామానామేన శ్రీవిద్యాసిద్ధిఃన కదాపినకామా నామితి'' యను మాటను నాటించుకొని, యాతరువాతను మోగసహితవిద్యయను స్తిరీకృతాంశమును జదుపులకొని లోకమునకు దుర్మార్గబోధ చేయకుందురుగాకయని కోరుచున్నారు. విద్యదుపాసకులకు నా మనవి శ్రీసూక్తపాఠమందు ''మ ఆనహ, మమావహ''యను రెండు పాదములను వ్యవహారముననున్నవి. శబ్దజ్ఞానముగల వారు, అది లేనివారి నోరునొక్కి 'మ అవహ' యనిపించుచున్నారు. నామఁ జిక్కిన ముద్రితప్రతులందు ''మమావహ'' యనియు కానవచ్చినది. నిర్దుష్టముగానున్న కొన్ని వ్రాతప్రతులందు 'మమావహ' పాఠముకనుటయు, స్వాధ్వాయసంపన్ను లైన వారి నోర వినుటయుఁగలదు. 'మే ఆవహ' యనునది సంధిసూత్రవశమున 'మ ఆవహ'మయి చక్కఁగానుండ, 'మమా+ఆవహ' యని అస్మచ్ఛబ్దవీరేల పడవలయు ననుకొను చుండెడి వాఁడను. గాని, కాలము గడపిన మఱికొందఱు వేదవేత్తలును 'మ మావహ' యనుట పలుతావుల విని 'ఏదియే నొక విశేషము లేకున్న నిట్టి పాకము చిరమునుండి వ్యవహారములో నుండదే. దీనికి సాధుత్వసమర్థన మెట్టిదై యుండునని యూహించుచుండగా, శ్రీసూక్తమునకుఁ బ్రకటార్థ మాత్రభాష్యమును వ్రాసిన శ్రీపృథ్వీధరాచార్యులు వాక్యములందు ''మమేతి పాఠే అస్మత్ప్రయోజనాయేత్యర్థః'' అనుమాట చూచి, యొకవిధముగాఁ బ్రాచీను లీపాఠము నంగీకరించుటనే కొందఱు స్వాధ్యాయపరులును నిది వ్యవహార మందుంచుకొనుటకు హేతువయ్యనని యెంచితిని. చతుర్థికి షష్ఠి తఱుచు గానవచ్చుటయుం గలదు. ఇటీవలి కావ్యాదులమాటకేమి, ''కథమస్య స్తన్యం దాస్యామి'' (హరివంశము) యను మున్నగునవెన్నో కలవు గాన ''మహ్యం, మే.'' యను చతుర్థికి ''మమ'' యను షష్ఠి ప్రయుక్తమని నిశ్చయించితిని. అయినను మావహ' యను దానినేల కైకొని యుందురు? పృథ్వీధరాచార్యులు ప్రకటార్థమునకే పూనుకొనినవారగుటచే 'మ మా వహ' యను దాని నంగీకరించి 'మమఅస్మత్ర్పయోజనాయ' యని వ్రాసి విడిచిరే కాని, యిందేదియో విశేషము తొల్లిటి వారి కభిప్రేతమై యుండునని యూహించి ''మమ్+ఆనహ= మ మావహ'' యై యుండును. మమ్=లక్ష్మిని, ఆవహ=పిలువుము, కాదా? మంత్రాభిధానమున--- ''మః కాలీ వసుధా చంద్రో లక్ష్మీర్మాతోగ్రబంధనే' విషం శివో మహావీరః శశిపుత్త్రో జనేశ్వరః'' అని గదా చెప్పుచున్నది? మఱియు శ్రీనాగభట్టరచితత్రిపురా సారసంగ్రహమున ''శక్తిః కుండలినీతి యా నిగదితా ఆఈమ సంజ్ఞా జగన్నిర్మాణ సతతోద్యతా ప్రవిలసత్సౌదామినీ సన్నిభా'' అను ప్రామాణిక ప్రయోగమును గలదు గదా; శ్రీసూక్త మందీశక్తియే కాదా లక్ష్మిగా నారాధింపబడునది. గాన నీ పాఠము సాహితీశూన్యులనోటఁబడి చెడిన ''మ ఆవహ'' కాదు. శ్రీసూక్తమునుఁ బలు బుక్కులందు, శ్రీ-ఈ-మ-చ-సా-మా మున్నగు లక్ష్మీబీజముల నాడాడ నిముడ్చుట మంత్రస్రష్ట యభిప్రాయమయి యుండును.'' అనియు, అట్టిచో బుక్కునందున లక్ష్మీపదమును ''సర్వ శుభలక్షణసంపన్నా లక్ష్మీః'' యనియో, ''లక్ష్మ్యతే యోగిభిరితిలక్ష్మీః'' యనియో, ''నీతి శాలినం లక్షయతీతి లక్ష్మీః'' యనియో యర్థము చెప్పికొని విశేషముగాఁ గైకొందురని సమర్థించుకొంటిని. ఇఁక నీరహస్వార్థమున వ్రాయు సందర్భమున నొక పండితునితో నీముచ్చట రాఁగా- ''శర్మగారూ! మ మానహ' యనునది యపపాఠము. దుష్టముగా నొక సాహితీశూన్యుఁడనుటయు నది మనము సమర్థింపఁ బూనుటయునా? తప్పు తప్పు. శబ్దజ్ఞానము లేని వైదికుల నోరఁబడి పరిషేచనమంత్రములును పాడైనవి; మీరు మాత్రమాయపాఠముపొంతఁబోవల''దని ప్రేమతో మందలించెను. అయ్యా! అది మాని యిది యవలంబింపుఁడని నేనొరుల నిర్బంధింపలేదు. ''స్థితస్య గతిశ్చింతనీయా'' యని నేనిటులూహించి యంటిని. మీరు దాని యసాధుత్వమును సిద్ధాంతీకరింపుఁడంటిని. అపుడాయన ''మ మావహ'' యనఁగానే ''కసై#్మ=ఎవనికొఱకు'' అను నాకాంక్షకు సమాధానము లేకపోవుననియె. అయ్యా! సకర్మక్రియపై నాకాంక్ష కింశబ్దద్వితీయాంతమే మైయుండును. ''కసై#్మ=ఎవరికొఱకు'' అని మీరును, ''తస్మాత్= దేనివలన'' అని మఱొకరును, ''కేన=దేనితో'' అని యింకొకరును, ''కస్మి&= దేనియందు'' అని వేఱొక్కఱును, ''కుతః=ఎచటినుండి'' యని యొకరునన, నిటులెన్నియో యా కాంక్షలుండునా? ఉపాసకుఁడు 'ఆవహ' యని ప్రార్థించునపుడు తనకొఱకుఁగాక యితరులకై పిలుపుమనునా? కొన్ని బుక్కులందు, ''ఉపహ్వయే=పిలుచుచున్నాను'' అని మాత్రమే యున్నది, 'మహ్యం, మే' అని యున్నదా? ''నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యాఅలక్ష్మీః యననపుడు ''మమ''యను నర్థమిచ్చుమాట యేదీ? ''మనసః కామమాకూతిం'' అనునపుడు ''మమ-మే'' యనినాఁడా? ఉత్తమపురుషక్రియా రూపమును బట్టి, యిట్టివన్నియు సధ్యాహారములుగా గ్రహించుకొందరే కానియా కాంక్షలందురా? యంటిని. తప్పు; పొరపాటు; మఱియొక పెద్దచిక్కున్నది, మీ రెఱుఁగరన్నాఁడు. సెలవిమ్మింటిని; ''మ ఆవహ'' యనునపుడు ''మ'' అనుదాత్తము గదా. 'మమావహ' యనఁగానే యది ఉదాత్తమో స్వరితమో యై పోయి స్వరాపరాధమేర్పడి, ''యథేంద్రశత్రుః స్వరతో7పరాధాత్త'' నునట్లు బాధించుననెను. ''అయ్యా! ఛందఃస్వరనిర్ణయ సూత్రములను నే నెఱుంగను; దయచేసి నాకీతావున ససూత్రకముగా బోధింపుమంటిని. పెద్దలందఱు నిది కారణముగానే, పృథ్వీధరాచార్యులు వికల్పముగా నంగీకరించినను, దానిని ద్రోసిపుచ్చి యపపాఠమని విడిచిపెట్టి'' రనంగా- ''మీమాటలను బట్టి మనయిరువురకును దెలియని దానితోఁ దెల్లవార్చిన లాభము లేదు. మనయూర ఛందస్స్వరనిర్ణయమాత్రము లెఱింగిన వేదవేత్తలును లేరు. నేను వృద్ధుఁడను, ధీనికైన దేశాంతరముల కిపుడు పోలేను. పుస్తకమున నివేదకమందొక మూల నాసంశయమును బెట్టి యుంచినచో నది గాంచు మహానుభావు లెవ్వరేనీ గరుణించి తెల్పుదురు. అని యీముచ్చటయుఁజేర్చి మీకు మరికొంత విసుగు గల్గించితిని. ననుసైఁచి, 'మమావహ' పాఠము సాధుతాసాధుతలను స్వరాపరాధచర్చతో సైతము నిర్ణయించి తెల్పిన పండితులకుఁ గృతజ్ఞుఁడనగుగుదును. వారును శ్రీసూక్తజాపకలోకమునకు మేలు చేసినవారగురుదురని విన్నవించుచున్నాను. శ్రీసూక్తములకుఁ బ్రకటార్థమును, ప్రత్యేకబుగ్జపక్రమాదులును గల చిన్నపుస్తకము సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తుతోడ ముద్రితమైనది. ''జయకృష్ణదాన్, హరిదాస్‌గుప్తా, చౌఖంబా, సంస్కృతసీరీస్ ఆఫీస్, బనారస్‌సిటీ'' అనుచోటికి వ్రాసినఁ బడయఁగలరు. పండితోపాసకపాదపాంసువు, శ్రీ శ్రియానందనాథుఁడు